సొంత వైద్యం వద్దు

31 Aug, 2020 06:34 IST|Sakshi
నిక్కీ గల్రానీ

కరోనా నుంచి కోలుకున్నారు కన్నడ భామ నిక్కీ గల్రానీ. తెలుగులో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించారామె. ‘మలుపు, మరకతమణి’ వంటి డబ్బింగ్‌ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. కరోనా నుంచి కోలుకోవడం గురించి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘నా కోసం ప్రార్థించిన వాళ్లకు, ప్రేమాభిమానాలు అందించినవాళ్లకు కృతజ్ఞతలు.

నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. కొన్ని నెలలుగా మనందరం ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నాం. భయం, ఆందోళన మన ఆలోచనల్ని తినేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిదే. కానీ అదే పనిగా భయపడటం కూడా సరైనది కాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు వైరస్‌ మన వరకూ ఎలా వస్తుందో తెలియదు. కానీ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా టెస్ట్‌ చేసుకోండి. ఏమీ లేదనుకుని మీ చుట్టుపక్కనవాళ్లను ఇబ్బందుల్లో పడేయొద్దు. 14 రోజుల్లో కోలుకోవచ్చు. డాక్టర్‌ను సంప్రదించండి. సొంత వైద్యం చేసుకోవద్దు’’ అన్నారు నిక్కీ.

మరిన్ని వార్తలు