Nikki Tamboli: సౌత్‌ డైరెక్టర్‌ అలా ప్రవర్తించడంతో ఏడుస్తూనే ఉండిపోయా

12 May, 2022 18:23 IST|Sakshi

హీరోయిన్‌ నిక్కీ తంబోలీ హిందీ బిగ్‌బాస్‌ 14లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచిమంచి ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు దక్షిణాదిలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. 'నాకిప్పటికీ గుర్తుంది, ఓ సౌత్‌ డైరెక్టర్‌ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. సెట్స్‌లో నాతోపాటున్న డ్యాన్సర్స్‌ అందరినీ మెచ్చుకుంటున్నాడు. నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడు.

అప్పుడు నాకు అక్కడి భాష మాట్లాడానికి వచ్చేది కాదు. కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడు. విదేశాల్లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు. నేను ఇంటికి వచ్చాక చాలా ఏడ్చేదాన్ని. కానీ మధ్యలో వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఎప్పటికైనా అతడు తన తప్పు తెలుసుకుని ఫీల్‌ అవుతాడని భావించాను. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్‌ చేస్తూనే ఉన్నాడు. కాలం అన్నింటినీ మార్చేస్తుంది' అని చెప్పుకొచ్చింది. కాగా నిక్కీ తంబోలి తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు', 'కాంచన 3', 'తిప్పరా మీసం' వంటి చిత్రాల్లో నటించింది.

చదవండి: నా ఫ్రెండ్స్‌ నన్ను ద్వేషించేవారు, ఎన్నో కష్టాలు అనుభవించాను

డ్యాన్స్‌ షో విన్నర్‌ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్‌ ఎక్కువవడం వల్లే..

మరిన్ని వార్తలు