హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘నైన్త్‌ అవర్‌’ చిత్రం

22 Aug, 2022 12:19 IST|Sakshi

విశ్వ కార్తికేయ, రిషికా కపూర్‌ జంటగా ఆనంద్‌ కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నైన్త్‌ అవర్‌’. రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత ఏయం రత్నం టైటిల్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.

ఆనంద్‌ కొలగాని మాట్లాడుతూ.. ‘‘వినూత్నమైన అడ్వెంచర్, యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. సెప్టెంబర్‌ 6న మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్ర కథ వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు రాజు గుడిగుంట్ల. ‘‘హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు విశ్వ కార్తికేయ. ‘‘ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిషికా కపూర్‌. నిర్మాతలు అచ్చిరెడ్డి, ప్రసన్న కుమార్, డీయస్‌ రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు