బైపోలార్ డిజార్డర్ ఉంది కానీ సైకోని కాదు : నటి

2 Jun, 2021 11:33 IST|Sakshi

పాపులర్ హిందీ సిరీయల్ ‘యే రిష్‏కా క్యా కెహ్లతా హై’నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తను గోడకేసి కొట్టాడని భార్య  నిషా రావల్ ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అతడిని సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఇక జూన్‌ 1న బెయిల్‌ మీద బయటకు వచ్చిన కరణ్‌ మెహ్రా భార్యపై పలు ఆరోపణలు చేశాడు. ఆమె బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతోందని,  ఆమె తలను ఆమే గోడ గోడకేసి కొట్టుకొని తన పేరు చెబుతోందని ఆరోపించాడు. తాజాగా భర్త ఆరోపణలపై నిషా రావల్‌ స్పందించారు. తాను బైపోలార్‌ డిజార్డర్‌ వ్యాధితో బాధపడుతన్న మాట నిజమేనని, కానీ తాను మాత్రం సైకో కాదని పేర్కొన్నారు.

‘బైపోలార్ డిజార్డర్‌ అనేది ఒక మానసిక రుగ్మత, ఇది తీవ్రమైన గాయం కారణంగా జరుగుతుంది. కొన్ని సార్లు జన్యు లోపం వల్ల కూడా జరగవచ్చు. ఈ వ్యాధి బారిన పడటం పట్ల నేను సిగ్గుపడడం లేదు. నాకు ఆ జబ్బు లేదని అబద్ధం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక మానసిక రుగ్మత మాత్రమే. కానీ నేను సైకోని మాత్రం కాను. నేను ఎంత సమతుల్యతతో ఉన్నానో అందరికి తెలుసు. నేను వెబ్‌ కంటెంట్‌ని రాయగల్గుతున్నాను. వీడియోలు చేస్తాను. నా మానసిక స్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు’అని నిషా రావల్‌ మీడియాకు తెలిపారు.

కాగా నిషా రావల్  పాపులర్ నటి కమ్ మోడల్. ఈమె కోకా కోలా, సన్ సిల్క్ షాంపూలతోపాటు పలు టీవీ యాడ్స్ లో కనిపించారు. అంతేకాదు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించారు.  చాలా కాలం డేటింగ్‌ అనంతరం 2012 లో కరణ్‌-నిషాలు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకి కవిష్‌ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
చదవండి:
నా భార్యే తలను గోడకేసి కొట్టుకుంది: టీవీ నటుడు
భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు