'నిశ్శబ్దం' శాటిలైట్‌ రైట్స్‌ దక్కించుకున్న జీ తెలుగు

7 Nov, 2020 19:42 IST|Sakshi

మూగ, చెవుడు ఉన్న ఒక క్యారెక్టర్‌ అనగానే అది చేయడానికి స్టార్‌ హీరోయిన్లు పెద్దగా సాహసించరు. కానీ అనుష్క ఈ సాహసం చేసింది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలంటే అనుష్క ఎప్పుడూ ముందుటారన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క సినిమా చేస్తుంది, అది కూడా మూగ, చెవుడు క్యారెక్టర్‌ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తన పక్కన హీరోగా ఒకప్పటి లవర్‌ బాయ్‌ మాధవన్‌ అని చెప్పగానే సినిమాకు హైప్‌ రెట్టింపయ్యింది. సినిమా షూటింగ్‌ పూర్తవ్వగానే ఒకొక్క అప్‌డేట్‌ బయటకి వచ్చింది.  (మెహర్‌ రమేష్‌‌ దర్శకత్వంలో మెగాస్టార్‌)

తీరా రిలీజ్‌ డేట్‌ ప్రకటించగానే లాక్‌డౌన్‌‌ అంటూ ఎవ్వరూ ఊహించని విధంగా 8 నెలల బ్రేక్‌ వచ్చింది. థియేటర్లు తెరుచుకుంటాయేమో.. నిశ్శబ్ధాన్ని ప్రేక్షకులు వెండితెరపై చూసే అవకాశం వస్తుందేమో అని మూవీ టీమ్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. ఎంతకీ థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనబడకపోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల అయ్యింది. నటీనటుల యాక్టింగ్‌ తప్ప ఇంకా ఏ విభాగంలోనూ సినిమాకు మంచి మార్కులు పడలేదు. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్‌ మాడ్సెన్‌ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది.

తన పాత్ర కోసం అనుష్క ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పెయింటింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. ఇంత చేసినా సినిమాకు ప్రాణం లాంటి క్లైమాక్స్‌ను దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ సరిగా చూపించలేకపోయాడు. అందుకే దీనికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన రాలేదు. ఓటీటీలో అంతగా ఆదరణ పోందలేని ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై రాబోతుంది. ఇటీవల నిశ్శబ్దం శాటిలైట్‌ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది. అనుష్క దీని తర్వాత రెండు సినిమాలను ఓకే చేశారని, అందులో ఒకటి ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్లనుందని ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు.   (బాహుబలి తిరిగొచ్చాడు)


 

మరిన్ని వార్తలు