మెహందీలో మెరిసిన షాలిని-నితిన్‌

24 Jul, 2020 17:53 IST|Sakshi

హైదరాబాద్‌ : యంగ్‌ హీరో నితిన్‌ పెళ్లి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఆదివారం రాత్రి 8.30 నితిన్-షాలినిలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్‌ ఫలక్‌నుమా హోటల్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. తాజాగా మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నితిన్‌ స్నేహితురాలు, ప్రముఖ స్టైలిస్ట్‌ డిజైనర్‌ కోన నీరజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.(నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌తో వేడుక‌లు షురూ)

ఈ వేడుకలో చేతులకు మెహందీ పెట్టుకున్న షాలిని.. రెడ్‌ కలర్‌ లెహంగాలో మెరిసిపోయారు. నితిన్‌ బ్లూ కలర్‌ కుర్తాలో కళ్లకు డిఫరెంట్‌ గాగూల్స్‌ పెట్టి స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా.. పరిమిత అతిథుల సమక్షంలో షాలిని మెడలో నితిన్‌ మూడు మూళ్లు వేయనున్నారు. సినీ పరిశ్రమ నుంచి హీరోలు పవన్‌ కల్యాణ్‌, వరుణ్‌ తేజ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌.. నితిన్‌-షాలినిల వివాహా వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా నితిన్‌ తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (నితిన్‌ పెళ్లికి టైమ్‌ ఫిక్స్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు