Sreeleela New Song: శ్రీలీల.. డేంజర్‌ పిల్లా!

3 Aug, 2023 05:57 IST|Sakshi

‘అరె బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీతాకోక చిలుకవా.., ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా.., డేంజర్‌ పిల్లా..’ అని పాడుతున్నారు నితిన్‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’. శ్రేష్ఠ్‌ మూవీస్, ఆదిత్య మూవీస్‌– ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

హారిస్‌ జైరాజ్‌ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘డేంజర్‌ పిల్లా..’ పాటను బుధవారం రిలీజ్‌ చేశారు. ఈ పాటను కృష్ణకాంత్‌ రాయగా అర్మాన్‌ మాలిక్‌ పాడారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.

మరిన్ని వార్తలు