Macherla Niyojakavargam OTT: ఓటీటీకి సిద్ధమైన మాచర్ల నియోజకవర్గం..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

26 Nov, 2022 10:01 IST|Sakshi

హీరో నితిన్‌, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, కేథరిన్​ థ్రేసా జంటగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్‌ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. తొలి షో నుంచే ఫ్లాప్‌టాక్‌ తెచ్చుకుంది ఈ సినిమా. ఎలాగైన ఈసారి హిట్‌ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

(చదవండి: కలెక్టర్​గా నితిన్​ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ)

అసలు కథేంటంటే..: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ అందుకున్న హీరో ఫ్యాక్షన్‌ను తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?  అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్‌ సరసన కృతిశెట్టి, కేథరిన్‌ నటించారు. ఈ చిత్రం ఓటీటీలో చాలా ఆలస్యంగా  వచ్చింది.
 

మరిన్ని వార్తలు