Macherla Niyojakavargam Movie: కృతిశెట్టి, నితిన్ నవ్వులు, మేకింగ్‌ వీడియో చూశారా?

9 Aug, 2022 17:13 IST|Sakshi

Nithiin Macherla Niyojakavargam Making Video Released: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్‌ హీరోయిన్స్‌ కృతీ శెట్టి, కేథరిన్‌ ట్రేసా కథానాయికలుగా అలరించనున్నారు. పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ మూవీకి దర్శకుడిగా పరిచయమయ్యారు.  రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. పలు యాక్షన్‌ సన్నివేశాలు, సాంగ్స్‌ షూటింగ్స్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే డ్యాన్స్ విషయంలో తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. షూటింగ్‌లో బ్రేక్‌ సమయంలో నితిన్‌, కృతిశెట్టి కబుర్లు చెప్పుకుని నవ్వుకోవడం సరదాగా ఉంది. కాగా పొలిటికల్‌ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, శుభలేక సుధాకర్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. 

మరిన్ని వార్తలు