Nithin: మీరు లేకపోతే నేను ఎక్కడా ఉండేవాడినో: నితిన్‌

14 Jun, 2022 15:08 IST|Sakshi

Nithin Emotional Post On His 20 Years Cinema Journey: 'జయం' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్‌ హీరో నితిన్‌. దిల్‌, సై, ఇష్క్‌ వంటి తదితర సినిమాలతో మంచి బ్రేక్‌ తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆగస్టు 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 2002లో 'జయం' సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన నితిన్ 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, దర్శక-నిర్మాతలకు సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. 

'డియర్‌ ఫ్రెండ్స్‌.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దీన్ని ఎలా వర్ణించాలో మాటలు కూడా రావడం లేదు. నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. 

చదవండి: కొడుకు ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌.. ఈసారి ముఖం కనిపించేలా

మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అందమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్‌లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని ట్విటర్‌లో ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశాడు నితిన్‌. 
 

మరిన్ని వార్తలు