నభా నటేశ్‌తో‌ నితిన్‌ బైక్‌ రైడ్‌.. ఆసక్తి పెంచిన ‘మాస్ట్రో’ కొత్త పోస్టర్

21 Apr, 2021 14:32 IST|Sakshi

జయాపజయాలతో సంబంధం లేకుండా వరసు సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను వదిలాడు. వాటిలో ‘చెక్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడగా, ‘రంగ్‌దే’ పర్వాలేదనిపించింది. ఇక నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ‘అంధాదున్‌’కి రీమేక్‌ ఇది. నటా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

నితిన్‌ పుట్టిన రోజున(మార్చి 30) ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ వదిలిన చిత్ర బృందం, తాజాగా శ్రీరామనవమి పురస్కరించుకొని ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. స్కూటర్ ను నభా నటేశ్ నడుపుతూ ఉండగా.. అంధుడి పాత్రను పోషిస్తున్న నితిన్ ఆమె వెనక కూర్చుని ఉన్నాడు. పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తమన్నా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జూన్ 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

చదవండి: 
గుండుతో హీరోయిన్‌ రష్మిక!.. ఫోటోలు వైరల్‌
'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్‌ ఫేడ్‌ అవుట్‌ అయ్యింది'

మరిన్ని వార్తలు