మార్చిలో రంగ్‌దే

2 Jan, 2021 01:12 IST|Sakshi

నితిన్, కీర్తీ సురేశ్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్‌దే’.  సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 26 ‘రంగ్‌దే’ థియేటర్లలో విడుదలకానుందని వీడియో ద్వారా విడుదల చేశారు. నితిన్, కీర్తీల డ్యాన్స్‌తో ఈ వీడియో ఉంది. ‘‘కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమకథే ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నాగవంశి. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు