‘రంగ్‌ దే’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

1 Jan, 2021 17:48 IST|Sakshi

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్‌‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రంగ్‌ దే చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలతో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి ట్విటర్‌లో షేర్‌ చేశారు. చదవండి: నితిన్‌ 30వ సినిమా షూటింగ్ షురూ

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. పాటలు, సన్నివేశాలు అన్ని కంప్లీట్‌ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. న‌రేష్‌, వినీత్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, గాయ‌త్రి ర‌ఘురామ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజిక‌ల్ మెలోడీ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `ఏమిటో ఇది వివ‌రించ‌లేనిది.. మ‌ది ఆగ‌మ‌న్న‌ది త‌నువాగ‌న‌న్న‌ది…` అంటూ సాగే ప‌ల్ల‌వి గ‌ల గీతానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించారు. హ‌రిప్రియ‌, క‌పిల‌న్ లు ఆల‌పించారు. హీరో నితిన్‌, కీర్తి సురేష్‌ల‌పై రొమాంటిక్ మెలోడీగా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు క‌లిగించేలా ఈ పాట‌ని ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి చిత్రీక‌రించారు. 

మరిన్ని వార్తలు