ఈ సారి గొడవ కలవడానికి చెయ్‌.. గెలవడానికి చేయకు‌

20 Mar, 2021 11:46 IST|Sakshi

హీరో నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా వస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ మూవీ ‘రంగ్‌దే’. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను వేగవంతంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ‘రంగ్‌దే’ ట్రైలర్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్‌లను ప్రేక్షకుల అంచనాలు పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ మూవీకి మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుందని చెప్పుకొవచ్చు.

ఇందులో ‘మనం ప్రేమించిన వాళ్ల విలువ మనం వద్దనుకున్నప్పుడు కాదు.. వారు మనల్ని అక్కర్లేదు అనుకున్నపుడు తెలుస్తుంది’ అంటూ నితిన్‌ ఎమోషనల్‌గా చెప్పె డైలాగ్‌ ప్రేమికులను టచ్‌ చేస్తోంది. ‘తొలిప్రేమ’,‘మజ్ను’ వంటి వైవిధ్యమైన ప్రేమ కథాచిత్రాలను ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ‘నేను అర్జున్‌. నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ని ప్రసాదించమని దేవుణ్ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకండ్‌కే ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్‌ చేసింది.. నా జీవితాన్ని’ అంటూ నితిన్ డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది.

ఆ తర్వాత వెన్నెల కిషోర్‌ ‘మీకు చేసిన దానికి వాడిపై కోపం రావడం లేదా’ అని కీర్తిని ప్రశ్నిస్తాడు. దీనికి కీర్తి ‘చంపేస్తే ఒక్కసారే పోతాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా’ అంటూ చెప్పె డైలాగ్‌ నవ్వులు పూయిస్తుంది. మొత్తానికి ఈ టైలర్‌ చూస్తుంటే మూవీలో నితిన్‌, కీర్తి సురేశ్‌లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారని అర్థం అవుతోంది. ఇక నితిన్‌ కీర్తికి భయపడుతూ చెప్పె కొన్ని పంచ్‌ డైలాగ్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని వార్తలు