షూటింగ్‌ మొదలు పెట్టేసిన నితిన్‌

14 Jun, 2021 20:45 IST|Sakshi

గతేడాది భీష్మతో భారీ హిట్‌ అందుకున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌. కానీ ఏడాది మాత్రం అతడు నటించిన రెండు సినిమాలు చెక్‌, రంగ్‌దే నిరాశనే మిగిల్చాయి. దీంతో అతడు అంధుడిగా నటిస్తున్న మాస్ట్రోతో హిట్‌ కొట్టాలనుకుంటున్నాడు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో మాస్ట్రో ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ జరుపుతున్నారట. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితినే కావడం విశేషం. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న మాస్ట్రోలో నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

చదవండి: రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే

మరిన్ని వార్తలు