‘ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’

27 Jul, 2020 07:25 IST|Sakshi

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్‌-షాలినీల కల్యాణం

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్‌–షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన నితిన్‌ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు.

పెళ్లి కానుక
నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్‌ కథానాయిక. నితిన్‌ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్‌ మ్యారేజ్‌ గిఫ్ట్‌ టు అవర్‌ హీరో’ అంటూ ‘రంగ్‌ దే’ టీమ్‌ టీజర్‌ని విడుదల చేసింది.  2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం (వెంకట్‌).

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు