పవన్‌ కల్యాణ్‌కు భార్యగా నిత్యా మీనన్‌!

3 May, 2021 13:12 IST|Sakshi

వకీల్‌సాబ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’. మలయాళ సూపర్‌ హిట్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్నదానిపై క్లారిటీ వచ్చేసింది.  మొదట సాయి పల్లవిని హీరోయిన్‌గా అనుకున్నా తన డేట్స్‌ కుదరక పోవడంతో సెట్‌ కాలేదు. దీంతో మేకర్స్‌ నిత్యా మీనన్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. ఇప్పటికే పవన్‌ సినిమాలో నిత్య నటించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే

.

తాజాగా ఈ సినిమాలో పవన్‌కు భార్యగా నిత్యా మీనన్‌ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఒక రకంగా ఈ సినిమా నిత్యామీనన్‌కు కంబ్యాక్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే  తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు ఆమె ఇంత వరకు సంతకం చేయలేదు. ఇక ఇదే సినిమాలో మరో యంగ్‌ హీరో రానా నటిస్తుండగా, అతడికి జోడీగా కోలివుడ్‌ నటి  ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారు. ఇటవలె పవన్‌ కల్యాణ్‌ కరోనా నుంచి కోలుకోవడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 

చదవండి : రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్‌ సందేశ్‌.. బోల్డ్‌ పోస్టర్‌ రిలీజ్‌
Vakeel Saab: పవన్‌ సినిమాపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు