అన్ని జాగ్రత్తలతో...

24 Sep, 2020 01:30 IST|Sakshi
నితిన్‌కి సీన్‌ వివరిస్తున్న వెంకీ అట్లూరి

నితిన్, కీర్తీ సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. ఈ మధ్యే హీరో నితిన్‌ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది.

బుధవారం మళ్లీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రభుత్వం విధించిన జాగ్రత్తలు పాటిస్తూ, ఈ షూటింగ్‌ను జరుపుతున్నారు. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ తో ఈ సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. నరేశ్, వినీత్, రోహిణి, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:  పీసీ శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు