Nivetha Pethuraj: నివేదా పేతురాజ్‌ తొలి వెబ్‌ సిరీస్‌.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

21 Sep, 2023 10:48 IST|Sakshi

ప్రముఖ తారలు వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గర కావచ్చు. ఈ క్రమంలో హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ను కూడా అలాంటి లక్కీఛాన్స్‌కు ఓకే చెప్పింది. ఇంతకు ముందు పలు చిత్రాలలో కథానాయికగా నటించిన ఈమె ఆ తరువాత తెలుగులోనూ సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. తాజాగా కాలా అనే వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అవినాష్‌ తివారీ కథానాయకుడిగా నటించిన ఇందులో రోహన్‌ వినోద్‌ మెహ్రా, నితిన్‌ గులాటి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

బిజాయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ను భూషణ్‌ కుమార్‌, కిషణ్‌ కుమార్‌, బిజాయ్‌ నంబియార్‌ కలిసి నిర్మించారు. ఈ సిరీస్‌ ఈ నెల 15వ తేది నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది మనీ లాండరింగ్‌, హవాలా కుంభకోణంతో సాగే క్రైమ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ అని నటుడు అవినాష్‌ తివారీ పేర్కొన్నారు. తను ఐబీ ఆఫీసర్‌గా నటించినట్లు చెప్పారు. తాను కూడా ఐబి అధికారిణిగా నటించినట్లు నివేద పేతురాజ్‌ పేర్కొంది. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఇదేనని చెప్పింది.

ఇందులో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. కాలా వెబ్‌సిరీస్‌లో పలు యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సీన్లలో నటించేందుకు అవినాష్‌ తివారీ ఎంతగానో సహకరించారని తెలిపింది. ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు తెలుగులో పరువు అనే మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానంది. అదేవిధంగా తమిళంలోనూ చిత్రాలు చేయబోతున్నట్లు తెలిపింది.

చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్‌.. అంటే ముందే ప్లాన్‌.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు