నివేదాకు వకీల్‌ సాబ్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

2 Nov, 2020 18:03 IST|Sakshi

తెలుగు, తమిళ, మలయాళంలో పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న నటి నివేదా థామస్‌. నిన్ను కోరి, జెంటిల్‌మేన్‌, బ్రోచేవారెవరురా, దర్బార్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాలు ఇప్పటికే ఆమె ఖాతాలో ఉన్నాయి. 2008లో వచ్చిన మలయాళం సినిమా 'వెరుతే ఒరు' భార్యతో వెండితెరకు పరిచయమైన నివేదా తను తమిళంలో చేసిన మొదటి చిత్రం 'కురువి'తో మంచి పేరు సాధించారు. 

మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ అయిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్‌గా వచ్చిన పాపనాశం సినిమాతో నివేదాకు అసలైన బ్రేక్‌ వచ్చింది. ఇందులో కమల్‌ హాసన్‌ సుయంబులింగం పాత్ర పోషించగా, నివేథా ఆయన కూతురు సెల్వి సుయంబులింగంగా నటించారు. ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న వకీల్‌ సాబ్‌ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న నివేదా షూటింగ్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ రోజు నివేదా థామస్‌ పుట్టినరోజు సందర్భంగా వకీల్‌ సాబ్‌ ఆమెకు బహుమతిగా ఒక స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు.  (కాజల్‌ వెడ్డింగ్‌ లెహెంగా తయారీకి 30 రోజులు)

కాగా.. పరిమిత సిబ్బందితో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతండగా నివేదా ఇటీవల షూటింగ్‌లో భాగమయ్యారు. పలు జాగ్రత్తలు పాటిస్తూ నివేదా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 7 నెలల లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. కోర్ట్‌ రూమ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న వకీల్‌ సాబ్‌కు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా థామస్‌ ఓ కీలక రోల్‌లో నటిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు