‘బింబిసార’గా కల్యాణ్‌ రామ్‌.. ఇది మరో ప్రయోగం

28 May, 2021 14:00 IST|Sakshi

Nandamuri Kalyan Ram: హిట్‌, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకన్నాడు నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నందమూరి హీరో.. ఇప్పుడు ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. తన తాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా శుక్రవారం తన కొత్తసినిమా టైటిల్‌ని ప్రకటించాడు.

మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం షేర్‌ చేసింది. కత్తిని పట్టుకుని కల్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కల్యాణ్ రామ్‌ లుక్‌ అందరికి ఆకట్టుకుంటుంది. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు