Thank You Teaser: లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు: నాగచైతన్య

26 May, 2022 05:51 IST|Sakshi

‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..’ అంటూ నాగచైతన్య చెప్పే డైలాగులతో ‘థ్యాంక్యూ’ చిత్రం టీజర్‌ విడుదలైంది. నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది.

ఈ చిత్రం టీజర్‌ని బుధవారం విడుదల చేశారు.‘నువ్వు సెల్ఫ్‌ సెంట్రిక్‌ అయ్యావు, నీ లైఫ్‌లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’ అంటూ హీరోయిన్‌ చెప్పే మాటలు కూడా టీజర్‌లో వినిపిస్తాయి. ‘‘ఈ చిత్రంలో వ్యాపారవేత్త అభిరామ్‌ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఓ సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌ జీవితంలోని ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. బీవీఎస్‌ రవి కథను అందించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీసీ శ్రీరామ్‌.  

మరిన్ని వార్తలు