జైల్లో రియాకు కనీసం ఫ్యాన్‌, బెడ్‌ కూడా లేదా..

11 Sep, 2020 20:43 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మంగళవారం అరెస్టు అయిన రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్న రియాకు ఈ రోజు(శుక్రవారం) కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, మరో నలుగురు నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. మొదటిసారి రియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్‌ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్‌ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించగా.. ఈసారి కూడా బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. (రియా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ)

ఇదిలా ఉండగా.. బైకుల్లా జైలులో నటి రియా సీలింగ్‌  ఫ్యాన్‌, మంచం కూడా లేని ఓ సెల్‌లో ఉన్నట్లు సమాచారం. రియాకు జైలులో భద్రత కారణంగా మూడు షిఫ్టుల్లో ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా ఉంటున్నారు. రియా పడుకునేందుకు కేవలం చాప మాత్రమే ఉన్నట్లు. కనీసం మంచం, దిండు కూడా ఇవ్వలేనట్లు తెలుస్తోంది. కాగా రియా సెల్‌లో ఫ్యాన్‌ లేదని అధికారులు తెలిపారు. ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఆమెకు టేబుల్‌ ఫ్యాన్‌ అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా బైకుల్లా జైలులో గత కొంత కాలంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఖైదీలకు పసుపు పాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె పక్కనే ఉన్న సెల్‌లో కుమార్తె షీనా బోరాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా ఉన్నారు. (2 సెకన్ల చీప్‌ పబ్లిసిటీ కోసమే; అవునా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు