జోడీ లేదు

26 Nov, 2020 00:21 IST|Sakshi

సినిమా అంటే హీరో, హీరోయిన్‌ పక్కా. అదో లెక్క. కానీ కథను బట్టి ఈ లెక్కల్ని మార్చొచ్చు. కథ అడిగినప్పుడు హీరో లేకుండా లేదా హీరోయిన్‌ లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా చిరంజీవి కూడా హీరోయిన్‌ లేకుండా సినిమా చేయబోతున్నారని తెలిసింది. మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం ‘లూసీఫర్‌’ను  తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ రీమేక్‌లో హీరోగా చేయనున్నారు చిరంజీవి.

కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మించనున్నారు. ఈ రీమేక్‌కు తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ‘లూసీఫర్‌’ సినిమాలో మోహన్‌లాల్‌కి జోడీగా హీరోయిన్‌ పాత్ర ఉండదు. అయితే తెలుగు రీమేక్‌లో పలు మార్పులు చేశారని, హీరోయిన్‌ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్‌ లేకుండానే ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా