No Time To Die: జేమ్స్‌బాండ్‌ ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్‌!

11 Sep, 2021 09:24 IST|Sakshi

హాలీవుడ్‌ మూవీస్‌లో జేమ్స్‌బాండ్‌ సిరీస్‌కి ఉన్న క్రేజ్‌ తెలిసిందే. ఈ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాటిలో ఉండే యాక్షన్‌ సీన్స్‌ అయితే మరో రేంజ్‌లో ఉంటాయి. అంతేకాకుండా వాటికి అదే రేంజ్‌ ఖర్చు కూడా పెడుతుంటారు మేకర్స్‌.

సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ సిరీస్‌లో ప్రస్తుతం 25 జేమ్స్‌బాండ్‌ మూవీగా ‘నో టైమ్‌ టు డై’ రూపొందుతోంది. ఇటలీలో ఇటీవల ఓ ఫైట్‌ సీన్‌ని చిత్రికరించింది చిత్రబృందం. దాని కోసం ఏకంగా 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్‌ను ఉపయోగించారంట. ఆ ఒ​​క్క సీన్‌ కోసమే ఏకంగా 50లక్షలకు పైగా ఖర్చుయిందట. గత నాలుగు చిత్రాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించిన డేనియల్‌ క్రేగ్‌ ఈ సినిమాలోనూ గూఢచారిగా చేస్తున్నారు. దాదాపు 2000 వేల కోట్ల బడ్జెట్‌ ఈ సినిమాకి క్యారీ జోజి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా కోసం 2019 నుంచి అభిమానులు నిరీక్షిస్తున్నప్పటికీ అది ఇంతవరకూ రిలీజ్‌ కాలేదు. కరోనా వైరస్‌ కారణంగా ఆ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అది సాధ్యపడటం లేదు. ప్రధానంగా లాక్‌డౌన్‌ నిబంధనలు కారణంగా నో టైమ్‌ టు డై’ విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. 

మరిన్ని వార్తలు