Oscar 2022: ఆస్కార్‌ బరిలో 'నో టైమ్‌ టు డై'.. 4 విభాగాలకు నామినేట్‌

9 Jan, 2022 16:31 IST|Sakshi

No Time To Die Movie In Oscar 2022 With 4 Categories: హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాలకు సంబంధించి అత్యంత ఆదరణ పొందిన చిత్రాల్లో ముందుగా ఉండేది జేమ్స్‌ బాండ్‌ సినిమాలు. బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌.. అనే ఈ ఒక్క డైలాగ్‌ చాలు బాండ్‌ అభిమానులను విజిల్స్‌ వేయించడానికి. ఈ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్‌ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతలా ఈ మూవీ సిరీస్‌ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకుంది. అందులో బాండ్‌ చేసే యాక్షన్‌ సీన్స్‌, ఉపయోగించే గ్యాడ్జెట్స్‌ ప్రేక్షకులను, అభిమానులను అబ్బురపరుస్తాయి. అంతేకాదు ఈ ఐకానిక్‌ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీలో నటించేందుకు ప్రముఖ హాలీవుడ్‌ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మొత్తం 25 సినిమాలు రాగా ఏడుగురు హీరోలు బాండ్‌గా అలరించారు. అయితే రీసెంట్‌గా వచ్చిన జేమ్స్‌ బాండ్‌ చిత్రం 'నో టైమ్‌ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్‌ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. 

ప్రపంచవ్యాప్తంగా 30 సెప్టెంబర్‌ 2021న విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్‌ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌. ఇందులో నాలుగు విభాగాల్లో 'నో టైమ్‌ టు డై' చిత్రం నామినేట్‌ అయింది. ఆస్కార్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో నాలుగింటికి ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం. ఆ నాలుగు విభాగాలు 1. మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ 2. మ్యూజిక్‌ (ఒరిజినల్‌ స్కోర్‌) 3. మ్యూజిక్‌ (ఒరిజినల్‌ సాంగ్‌-చిత్రం టైటిల్‌ సాంగ్‌) 4. సౌండ్‌. అయితే ఈ నాలుగింటిలో 'నో టైమ్‌ టు డై' సినిమా ఎన్ని ఆస్కార్‌లు కొల్లగొడుతుందో చూడాలి.

సినిమా ప్రత్యేకతలు:
తొలిసారిగా ఈ చిత్రం కోసం ఒక అమెరికన్‌ డైరెక్టర్‌ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. బీస్ట్‌ ఆప్‌ నో నేషన్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆకర్షించిన కారీ జోజి ఈ సినిమాకు డైరెక్టర్‌. అలాగే ఈ సినిమా సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌ కూడా బాండ్‌ చిత్రాలకు తొలిసారిగా పనిచేశారు. ఈయన 'ఇన్సెప్షన్‌', 'ది డార్క్‌ నైట్‌', 'గ్లాడియేటర్‌', 'లయన్‌ కింగ్' వంటి చిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. బాండ్‌ చిత్రాల్లో ప్రత్యేకంగా  చెప్పుకోవాల్సిన అంశం టైటిల్‌ సాంగ్‌. ఈ సాంగ్‌పై ప్రతీ బాండ్‌ చిత్రానికి భారీ అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్కకుండా 'నో టైమ్‌ టు డై' ఒరిజినల్‌ సాంగ్‌ అదరగొట్టింది. 

ఈ పాటను 18 ఏళ్ల యువ సంగీత సంచలనం బిల్లీ ఐలిష్‌ పాడటం విశేషం. బాండ్‌ సినిమాకు టైటిల్‌ సాంగ్‌ పాడిన అతిపిన్న వయస్కురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. అలాగే 'స్పెక్టర్‌' సినిమాకు సామ్‌ స్మిత్‌ పాడిన 'రైటింగ్‌ ఆన్‌ ది వాల్‌' సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. హాలీవుడ్‌ ప్రేమకథా చిత్రం 'లాలా ల్యాండ్‌'తో ఆస్కార్‌ గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ 'లైనస్‌ సాండ్‌గ్రెన్' ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. 


 


ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్‌ బరిలో ఏకంగా 4 మార్వెల్‌ చిత్రాలు

మరిన్ని వార్తలు