నో టైం టు డైతో క్రెయిగ్‌ ఎండ్‌, కొత్త జేమ్స్‌ బాండ్‌ ఎవరంటే..

29 Sep, 2021 08:28 IST|Sakshi

No Time To Die: బ్రిటిష్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌ బాండ్‌ క్యారెక్టర్‌ హోదాలో చివరిసారిగా రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంచైజీలో రాబోతున్న 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై’ ఈ నెల 30న యూకేతో పాటు భారత్‌లోనూ(తెలుగులో కూడా) రిలీజ్‌ కాబోతోంది. 


ఈ తరుణంలో మంగళవారం లండన్‌లో స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేశారు. ఈ ప్రదర్శనకు నో టైం  టు డై నటీనటులతో పాటు ప్రముఖ బ్రిటిష్‌ యాక్టర్స్‌ తరలివచ్చారు.  ఇక బాండ్‌ క్యారెక్టర్‌ హోదాలో చివరిసారిగా యాభై మూడేళ్ల డేనియల్‌ క్రెయిగ్‌  రెడ్‌ కార్పెట్‌పై కనిపించారు. క్రెయిగ్‌తో పాటు ఈ సినిమాలో బాండ్‌గర్ల్‌గా కనిపించనున్న అన డె ఆర్మస్‌, విలన్‌ పాత్ర పోషించిన రామీ మాలేక్‌ కూడా సందడి చేశారు.

ఇదిలా ఉంటే బాండ్‌ ఫ్రాంచైజీలో ఏడో జేమ్స్ బాండ్‌ డేనియల్‌ క్రెయిగ్‌.  ఈ బ్రిటిష్‌ స్పై సిరీస్‌లో డెనియల్‌ క్రెయిగ్‌ 2006 కాసినో రాయల్‌లో తొలిసారి బాండ్‌గా కనిపించాడు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత తన నటనతో అలరిస్తూ వచ్చాడు. క్వాంటమ్‌ ఆఫ్‌ సోలేస్‌(2008), స్కైఫాల్‌(2012), Spectre (2015)లో బాండ్‌గా అలరించాడు డేనియల్‌ క్రెయిగ్‌. నిజానికి నో టైం టు డై సినిమా కంటే ముందే రిటైర్‌ అవ్వాలని భావించినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్‌ కమిట్‌మెంట్‌ కారణంగా చేయాల్సి వచ్చిందని క్రెయిగ్‌ క్లారిటీ ఇచ్చాడు.

  

క్రెయిగ్‌ రిటైర్‌మెంట్‌ తరుణంలో తర్వాతి బాండ్‌ ఎవరనే చర్చ కూడా నడుస్తోంది. నాన్‌-బ్రిటిష్‌ ఆర్టిస్ట్‌,  బ్లాక్‌ ఆర్టిస్ట్‌ను లేదంటే ఫిమేల్‌ బాండ్‌ను జేమ్స్‌ బాండ్‌ క్యారెక్టర్‌లో ఇంట్రడ్యూస్‌ చేయాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఈయోన్‌ ప్రొడక్షన్స్‌ ఉన్నట్లు సమాచారం.
 

చదవండి: జేమ్స్‌ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు