హీరోయిన్‌గా అవకాశాలు లేక నోయల్‌ మాజీ భార్య..

1 Apr, 2021 20:07 IST|Sakshi

డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన వెయ్యి అబద్దాలు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్‌‌. ఆ తర్వాత సునీల్‌ సరసన 'భీమవరం బుల్లోడు సినిమాలో నటించినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనే సింగర్‌ నోయల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏడాది కూడా గడవక ముందే వారి పెళ్లి పెటాకులైంది. ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇరువురూ సోషల్‌ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమతమ కెరియర్‌లో ముందుకు సాగారు. అయితే పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే పలు మ్యూజిక్‌ ఆల్భమ్స్‌లో నటించిన ఎస్తర్‌‌...కొన్ని పాటలు కూడా పాడింది. త్వరలోనే ఓ కన్నడ మూవీతో సంగీతదర్శకురాలిగానూ పరిచయం కానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్‌4న రివీల్‌ చేస్తానని వెల్లడించింది. 

A post shared by Ester Valerie Noronha (@esternoronhaofficial)

చదవండి : విడాకులు తీసుకున్నాం: నోయల్‌
'పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్‌ ఏదేదో చేయించాడు'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు