హీరోయిన్‌; పోర్న్‌ స్టార్‌గా నటి ఎస్తేర్‌..

15 Jan, 2021 11:56 IST|Sakshi

1000 అబద్దాలు సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమైన నటి ఎస్తేర్‌ ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. సునీల్‌తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు చిత్రం ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. అనంతరం గరం, జయ జానకి నాయక వంటి ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళ, కన్నడ భాషలపు దృష్టి సారించింది. 2019లో సింగర్‌ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఎస్తేర్‌.. వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఏడాదికే అతనితో విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అయితే ఢిఫరెంట్‌ పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు ఎస్తేర్‌ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్‌ : అభిజిత్‌కి రోహిత్‌ శర్మ ఊహించని గిఫ్ట్‌

చెప్పిన మాట ప్రకారమే తాజాగా ఓ తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఇంతకముందెప్పుడూ చేయని బోల్డ్‌ క్యారెక్టర్‌ను ఎస్తేర్‌ పోషించనున్నారు. ‘హీరోయిన్’ అనే టైటిల్‌తో ఫోర్న్ స్టార్ కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో కనిపించనుది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఏస్తేర్ పోర్న్ స్టార్‌గా నటించనుంది. ‘ఉత్తర’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తిరుపతి ఎస్‌ఆర్‌ తన రెండో ప్రయత్నంగా ‘‘హీరోయిన్’’ అనే సినిమాను రూపొందించబోతున్నారు. త్వరలోనే షూటింగ్‌‌ ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

‘ప్రపంచం కీర్తించే ఇండియా సాంప్రదాయం ముసుగులో మలినం ఉంది. సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది” అని అంటున్నారు దర్శకుడు ఎస్‌ఆర్‌ తిరుపతి. ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్తేర్‌ కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ సన్నాహాల్లో ఉన్నామని, త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎస్తేర్‌ కెరీర్‌లో ఈ సినిమా ఓ మలుపు తిరగనుందని అభిప్రాయపడుతున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. 

చూడండి:
ఎస్తేర్ గ్లామర్‌ ఫొటోస్

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు