వెలవెలబోయిన వేడుక

2 Mar, 2021 01:16 IST|Sakshi

78వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ వేడుక వర్చ్యువల్‌గా జరిగింది. కోవిడ్‌ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో తారల సందడి లేక ఈసారి వేడుక కాస్తంత వెలవెలబోయింది. న్యూయార్క్, లాస్‌ ఏంజిల్స్‌ లొకేషన్స్‌ నుంచి టీనా ఫే, అమీ పోహ్లెర్‌ ఈ వర్చ్యువల్‌ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. గోల్డెన్‌  గ్లోబ్‌ నామినేషన్స్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రకటించారు. టీవీ, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి ఈ అవార్డులను అందించడం జరగుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో వివాదాస్పదమైన ‘ది క్రౌన్‌ ’ షో నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్‌  గ్లోబ్‌ బెస్ట్‌ మోషన్‌  పిక్చర్‌గా ‘నోమాడ్‌ ల్యాండ్‌’ చిత్రం నిలిచింది. బెస్ట్‌ మ్యూజికల్‌ మూవీగా ‘బోరాట్‌ సబ్‌ సీక్వెంట్‌ మూవీ ఫిలిమ్‌’ నిలిచింది. బెస్ట్‌ టెలివిజన్‌  డ్రామా సిరీస్‌గా ‘ది క్రౌన్‌ ’ నిలిచింది. ‘మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌’లోని నటనకు గాను చాద్విక్‌ బోస్‌మెన్‌ కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు దక్కింది. ‘ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బిల్లీ హాలీడే’లో నటించిన ఆండ్రా డే ఉత్తమ నటిగా నిలిచారు. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘మినారీ’ నిలిచింది. ‘నోమాడ్‌ ల్యాండ్‌’ను డైరెక్ట్‌ చేసిన క్లోవ్‌ జావో ఉత్తమ డైరెక్టర్‌గా నిలిచారు.

మరిన్ని వార్తలు