4 రోజులుగా నిద్ర లేకుండా నటి షూటింగ్‌!

1 Mar, 2021 17:52 IST|Sakshi

నోరా ఫతేహీ.. స్పెషల్‌ సాంగ్స్‌లో ఆడిపాడే ఈమె ఆఫ్‌స్క్రీన్‌లోనూ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. షూటింగ్‌ మధ్యలో ఏ చిన్న గ్యాప్‌ దొరికినా తెగ అల్లరి చేస్తుంటుంది. తాజాగా ఆమె షూటింగ్‌ లొకేషన్‌లో సాంగ్‌కు రెడీ అవుతూ, ప్రాక్టీస్‌ చేసిన ఓ ఫన్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో తను వాడిన విగ్గును నిమురుతున్న నోరా షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పని ఒత్తిడి కారణంగా కొంత అలిసిపోయినట్లు తెలుస్తోంది. "నాలుగు రోజులుగా కంటి నిండా నిద్ర పోకుండా మరీ షూటింగ్‌ చేశాం. తర్వాత హాయిగా ఓ కునుకు తీయాలి" అని పేర్కొంది. 

అయితే ఆమె నిద్రలేని రాత్రుళ్లు మాత్రమే కాదు, రాజస్తాన్‌లో చెమటలు కక్కించే మండుటెండలోనూ భారీ లెహంగాలు వేసుకుని నిప్పు ముందు డ్యాన్స్‌ చేసింది. ఇందులో రాజస్తాన్‌లోని బంజారాల డ్రెస్సింగ్‌ స్టైల్‌ను ఆమె ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఆమె ఇంతలా కష్టపడింది ఆ మధ్య రిలీజైన 'చోర్‌ దేంగే..' సాంగ్‌ కోసమే.. అరవిందర్‌ ఖైరా డైరెక్ట్‌ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన ఒక్క రోజులోనే 25 మిలియన్ల వ్యూస్‌ సంపాదించుకుంది.

A post shared by Nora Fatehi (@norafatehi)

ఇక నోరా గురించి ఆ సాంగ్‌ టీమ్‌లోని ఓ సభ్యుడు మాట్లాడుతూ.. 'అసలే ఎండాకాలం.. పైగా అది రాజస్తాన్‌. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డాం. అయినా సరే మేము షూటింగ్‌ పూర్తి చేశాం. నోరా బరువైన లెహంగాలు ధరించి, నిప్పు మధ్యలో డ్యాన్స్‌ చేసింది. ఆమె అంకితభావానికి మేమంతా ఆశ్చర్యపోయాం. చిన్న బ్రేక్‌ కూడా తీసుకోకుండా, ఏమాత్రం అలసట చెందకుండా షూటింగ్‌లో పాల్గొంది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: మరో బాలీవుడ్‌ చిత్రానికి బాహుబలి‌ రచయిత స్క్రిప్ట్‌

సన్నీడియోల్‌ మొదట ప్రేమించింది ఎవరినంటే?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు