నాకు తైమూర్‌ అయితే ఓకే..

8 Jan, 2021 19:27 IST|Sakshi

 ముంబై: నోరా ఫతెహీ ప్రత్యేకమైన తన డ్యాన్స్‌ శైలితో‌ ఐటెం సాంగ్స్‌ భామగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ‘సత్యమేవ జయతే’లో ‘దిల్భర్‌ దిల్బర్’‌, ‘బట్ల హౌజ్’‌లోని ‘ఓ సాకి సాకి’ పాటలలో అద్భుతమైన డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చి‌ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం స్పెషల్‌ సాంగ్స్‌తో పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న నోరా ఇటీవల హీరోయిన్‌ కరీనా కపూర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నరెడియో టాక్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోరాను పెళ్లేప్పుడు అని అడిగ్గా.. కరీనా ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్‌‌ పెద్దాయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఆమె సమాధానానికి షాకైయినా కరీనా.. తైమూర్‌కు కేవలం నాలుగేళ్లేనని, దానికి ఇంకా చాలా సమయం ఉందంటూ సరదాగా బదులియ్యడంతో.. నోరా పర్వాలేదు అప్పటి వరకు వేయిట్‌ చేస్తానంటూ కరీనాను ఆటపట్టించారు. (చదవండి: మార్ఫింగ్‌ చేశారు: క్లారిటీ ఇచ్చిన టెరెన్స్)

ఇక చిత్ర పరిశ్రమలో తన కేరీర్‌ గురించి మాట్లాడుతూ..  ప్రారంభంలో కాస్టింగ్‌ కౌచ్‌కు గురయ్యానంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘నేను కెనడా నుంచి ఇండియాకు వచ్చాక సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడు నన్ను లైంగికంగా వేధించాడు. అయితే అతడి పేరును బయటపెట్టాలనుకోవడం లేదు. కానీ అతడి వేధింపుల వల్ల నేను తిరిగి కెనడా వెళ్లిపోవాలనుకున్న’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా నోరా తదుపరిగా ‘భుజ్:‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’లో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు. ఇందులో అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హాలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక కరీనా ‘లాల్‌​ సింగ్‌ చద్దా’లో అమీర్‌ ఖాన్‌ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి తల్లి కాబోతున్న సందర్భంగా ఆమె ఈ సినిమాలోని తన షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. (చదవండి: వ్యవసాయం చేస్తున్న తైమూర్‌, సైఫ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు