Allu Arjun: బన్నీ షాకింగ్‌ లుక్‌ వైరల్‌, దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నార్త్‌ నెటిజన్లు

27 Jun, 2022 19:18 IST|Sakshi

Trolls On Allu Arjun New Look: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు సౌత్‌లో విపరితమైన క్రేజ్‌ ఉంది.  ఆయన స్టైల్‌కు, మ్యానరిజంకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్‌తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి వీపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా పుష్ప మూవీతో నార్త్‌లో సైతం మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు బన్నీ. ఈ సినిమాలో పుష్పరాజ్‌గా అతడు సంపాదించుకున్న క్రేజ్‌అంతా ఇంత కాదు.

చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్‌ రియాక్షన్‌ చూశారా!

తగ్గేదే లే అనే డైలాగ్‌తో అల్లు అర్జున్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అందుకే పుష్ప డైలాగ్స్‌ను కేవలం దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఫాలోయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప మానియానే కనిపించింది. ఇక శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్‌ హుక్‌ స్టెప్‌ను ప్రతి ఒక్కరు అనుసరించారు. అంతలా పుష్ప మూవీలో తన లుక్‌, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్‌పై నార్త్‌ నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప: ది రూల్‌ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని పలు లోకేషన్లో పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ను జరుపుకుంటుంది.

ఇటీవల హైదరాబాద్‌ ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకోగా ఇందుకు సంబంధించిన బన్నీ లుక్‌ లీకైంది. మానవ్‌ మంగ్లాని అనే బాలీవుడ్‌ ఫొట్రోగాఫర్‌ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్‌ లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో బన్నీ కాస్తా బొద్దుగా.. గుండ్రాలు తిరిగిన హేర్‌ స్టైల్‌తో దర్శనం ఇచ్చాడు. ఇక లావుగా తయారైన బన్నీ లుక్‌పై నార్త్‌ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘‘ వడా పావ్’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్‌ మలింగా లా ఉన్నాడు’, ‘ఓ మై గాడ్‌ స్టైలిష్‌ స్టార్‌కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగానే అ‍ల్లు అర్జున్‌? బాబోయ్‌ చాలా బరువెక్కాడు’’ అంటూ కొందరూ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్‌, కాజల్‌ టాప్‌

ఇక మరికొందరు నెటిజన్లు బన్నీ వస్తున్న ట్రోల్స్‌ను ఖండిస్తూ ‘పుష్ప: ది రూల్‌ కోసం ఆయన కాస్తా లావుగా తయారవ్వాల్సి ఉంది. అందుకే ఆయన బరువెక్కారు’ అంటూ వివరణ ఇస్తున్నారు. మొత్తానికి పుష్ప 2లో బన్నీ కాస్తా బోద్దుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర(రష్మిక మందన్నా) చనిపోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌లోపై నిర్మాత వై. రవిశంకర్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ చానల్‌తో ముచ్చటించిన ఆయన శ్రీవల్లి పాత్రపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు పూర్తి కథ తామే వినలేదని, ఇవన్ని వట్టి పుకార్లలేనిన కొట్టిపారేశాడు. 

A post shared by Manav Manglani (@manav.manglani)

మరిన్ని వార్తలు