Dhagad Samba: కొత్త సంపూని చూస్తారు 

18 May, 2022 08:40 IST|Sakshi
డైరెక్టర్‌  ఎన్‌ఆర్‌ రెడ్డి, సంపూర్ణేష్‌ బాబు

‘‘ధగడ్‌ సాంబ’ చిత్రం సంపూ కెరీర్‌లో ది బెస్ట్‌ అవుతుంది. ఇందులో కొత్త సంపూని  చూస్తారు. కుటుంబ ప్రేక్ష కులు చూసేలా సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ ఎన్‌.ఆర్‌. రెడ్డి అన్నారు. సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి జంటగా బి.ఎస్‌. రాజు సమర్పణలో ఆర్‌ఆర్‌. బీహెచ్‌ శ్రీనుకుమార్‌ రాజు నిర్మించిన ’ధగడ్‌ సాంబ’ ఈ నెల 20న విడుదల కానుంది.

ఎన్‌ఆర్‌. రెడ్డి మాట్లాడుతూ– ‘‘ధగడ్‌ సాంబ’కి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ ప్లే, లిరిక్స్, పాటలు నేనే రాసుకున్నాను. ఈ చిత్రకథను నా ఫ్రెండ్, కెమెరామేన్‌ ముజీర్‌కి వినిపించాను. సంపూకి కూడా నచ్చడంతో సినిమా చేశాం. ఈ సినిమా ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది. ముజీర్‌ ఈ సినిమాకి మెయిన్‌ పిల్లర్‌లా నిలిచారు’’ అన్నారు. 

మరిన్ని వార్తలు