ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. ఘనంగా ఏర్పాట్లు

16 May, 2022 12:21 IST|Sakshi

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా,రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి.

ఆయన స్వగ్రామం నిమ్మకూరులో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కాన్నునాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్గీయ తారక రామారావుశత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 

మరిన్ని వార్తలు