ఎన్టీఆర్‌ 30: హీరోయిన్‌గా ముంబై బ్యూటీ!

14 Apr, 2021 15:33 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా నటించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ను రంగంలోకి దించుతున్నారట. ముంబై బ్యూటీ కియారా అద్వానీతో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిల్మీదునియాలో టాక్‌ వినిపిస్తోంది. 'భరత్‌ అనే నేను'తో తెలుగులో హిట్‌ అందుకున్న కియారా ఇక్కడ కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.

'వినయ విధేయ రామ'లో మెగా హీరో రామ్‌చరణ్‌ సరసన ఆడిపాడిన ఆమె లేటెస్ట్‌గా యంగ్‌ టైగర్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందన్న విషయం తెలియాలంటే చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించాల్సిందే. ఇక ఓటీటీలో 'లస్ట్‌ స్టోరీస్'‌లో బోల్డ్‌ క్యారెక్టర్‌తో మెప్పించిన కియారా ప్రస్తుతం హిందీలో భూల్‌ భులయ్యా 2, జగ్‌ జగ్‌ జీయో, మిస్టర్‌ లేలే సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

చదవండి: లెక్క అర్థమైపోయింది: కియారా అద్వానీ

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన రాఖీ మూవీ స్టిల్స్‌

మరిన్ని వార్తలు