NTR 30 Update: ఆచార్య ఎఫెక్ట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ!

28 Aug, 2022 11:55 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఏంటి ? ఈ ప్రశ్నకి ఆల్రెడీ రామ్‌చరణ్‌ సమాధానం చెప్పేశాడు. స్టార్‌ డైరె క్టర్‌ శంకర్‌తో సినిమా షూటింగ్‌ కూడా మొదలైపోయింది. మరో పాన్‌ ఇండియా మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిపోయింది.ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన ఎన్టీఆర్‌ మాత్రం ఇంకా కెమెరా ముందుకు రాలేదు. తర్వాత చిత్రం కొరటాల శివతో చేయాల్సి ఉంది.

అయితే ఆచార్య ప్లాప్‌తో ఎన్టీఆర్‌ మనసు మార్చుకున్నారని, కొరటాల సినిమా కంటే ముందు  ప్రశాంత్‌ నీల్‌ మూవీనే స్టార్ట్‌ అవుతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్‌  న్యూస్‌ ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. కొరటాల శివతోనే ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందట. ఈసారి ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌తో రంగంలోకి దిగబోతున్నారట. జనతా గ్యారేజ్‌కి మించి న హిట్‌ ఇవ్వడానికి కొరటాల స్క్రిప్ట్‌ సిద్ధం చేసేశాడన్నది ఆ వార్త సారాంశం.

(చదవండి: సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్‌కు కారణం ఇదేనా?)

వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలకు ముందే ఎన్టీఆర్‌తో కొరటాల తీయబోయే సినిమాపై అంచ నాలు పెరుగుతూ వచ్చాయి. అయితే…ఆచార్య ఫ్లాప్‌తో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. కొరటాల చెప్పిన కథ విషయంలో ఎన్టీఆర్‌ సంతృప్తి చెందలేదట. కొన్ని మార్పులు సూచించారట. ఇన్నాళ్లు మార్పులు మీద ఫోకస్‌ పెట్టిన కొరటాల.. తాజాగా  కీలక నిర్ణయం తీసుకున్నారట.  ఆ కథని పూర్తిగా  పక్కనపెట్టి మరో కథకి పదును పెట్టారట.

(చదవండి: జూ.ఎన్టీఆర్‌ సినిమాకు నో చెప్పిన సమంత? కారణం ఇదేనట!)

సముద్రం, షిప్‌లు సినిమాలో కొంత భాగం ఉంటాయట. అలానే మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌లో మూవీ సాగుతోందట. దీంతో…సందేశాత్మక కథకి కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ సినిమాలు తీసే కొరటాల… ఈసారి యాక్షన్‌, మాస్‌ డోస్‌ పెంచబోతున్నాడని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో …మిర్చికి మించి మసాలా ఉండొచ్చని, అదే జరిగితే మరో బ్లాక్‌బస్టర్‌ ఖాయమని  ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించాడు ఎన్టీఆర్‌. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు మించిన హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడాయన. ఇటు కొరటాల కూడా ఆచార్యతో ఊహించని ఫ్లాప్‌ని ఎదుర్కొన్నాడు. నిజానికి కొరటాల శివ కెరీర్‌లో ఇదే ఫస్ట్‌ ఫ్లాప్‌. చిరంజీవి, రామ్‌చరణ్‌లను పెట్టుకుని కొరటాల యావరేజ్‌ మార్క్‌ కూడా దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ రేంజ్‌లో ఒక హిట్‌ ఎన్టీఆర్‌కి, తన పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఒక హిట్‌ కొరటాలకి అవసరం. అందులోనూ ఇది పాన్‌ ఇండియా మూవీ. అందుకే యాక్షన్‌ జానర్‌ అయితే పాన్‌ ఇండియా సినిమాకి కరెక్ట్‌గా సెట్‌ అవుతుందని కొరటాల భావిస్తున్నారట. కథ తుది మెరుగు లు దిద్దుకుంటుందని.. ఎన్టీఆర్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే నవంబర్‌లో ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు