NTR30: ఇచ్చిన మాట కొరటాల నిలబెట్టుకుంటాడా?

28 Mar, 2023 18:01 IST|Sakshi

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ జీవితాలే కాదు..డైరెక్టర్స్ జీవితాలు కూడా హిట్స్, ప్లాప్స్ మీదే ఆధారపడి ఉంటాయి. హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ అయినా ఒక ప్లాప్ మూవీతో ఫేడ్ అవుట్ అయిపోతాడు. మళ్లీ మరో సినిమాతో సక్సెస్ అందుకుంటేనే ఆ డైరెక్టర్స్ కి ఆఫర్స్ వస్తాయి. లేకపోతే అంతే సంగతులు.

ఆచార్య లాంటి డిజాస్టర్ తీసిన కొరటాల సేమ్ స్టిట్యూవేషన్ లో ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ 30 తో తన ఎంటో చూపించాలనుకుంటున్నాడు. కొరటాల శివ తను తీసే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మేసేజ్ కూడా ఉండేలా చూసుకుంటాడు. మిర్చి తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ ...డెబ్యూ మూవీతోనే మాస్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొరటాల రైటర్ కావటంతో ...మిర్చి సినిమాలో ప్రభాస్‌ డైలాగ్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ లో డైరెక్టర్ గా తన స్టైల్ ఏంటో చూపించాడు కొరటాల. 

ఆ తర్వాత మహేశ్‌ తో శ్రీమంతుడు...ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కించి డైరెక్టర్ గా కొరటాల హ్యాట్రిక్ అందుకున్నాడు. కొరటాల సినిమా అంటే మెసేజ్ తో పాటు..హీరో ఎలివేషన్స్ ..అండ్ యాక్షన్‌ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని...శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ప్రూవ్ చేశాయి. 

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ మహేశ్‌ తో తెరకెక్కించిన సినిమా భరత్ అను నేను. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌ ను ముఖ్యమంత్రిగా చూపించాడు.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కించిన ఈ సినిమా మహేశ్‌ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు..సినీ అభిమానులందరికీ మంచి కిక్ ఇచ్చింది. తన కథ...కథనాలతో తెరకెక్కిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కావటంతో...కొరటాల తనదైన శైలిలో ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాన్ చేశాడు. ఈ సినిమా విషయంలో కొరటాల అంచనాలు తలకిందులైయ్యాయి. మెగాస్టార్ కెరీర్ లోనే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

ఆచార్య ప్లాప్ కావటంతో కొరటాల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చిరంజీవి అయితే చాలా సార్లు ఆచార్య ప్లాప్ కావటానికి డైరెక్టర్ కొరటాల శివ కారణమంటూ ఇన్ డైరక్ట్ గా కామెంట్స్ చేశాడు. ఇక ఆచార్య సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొరటాల కోరినట్లే ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆచార్య సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ..కొరటాల ఎన్టీఆర్ 30 కమిట్ అయ్యాడు. 

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.ఇక కొరటాల తో ఎన్టీఆర్ మూవీ ఉండదనే మాట కూడా వినిపించింది. అయితే ఎన్టీఆర్ కొరటాల పై ఉన్న నమ్మకంతో ఇచ్చిన మాటకి అలాగే ఫిక్స్ అయ్యాడు. కాకపోతే పాన్ ఇండియా మూవీ తీయాలని కండీషన్ పెట్టాడు. దీంతో కొరటాల ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉండే స్టోరీని రెడీ చేశాడట.  పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌ లో ఓ పిక్షనల్ యాక్షన్‌ స్టోరీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. తన కథ పై కొరటాల ఎంత నమ్మకంగా ఉన్నాడనేది...ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ లో మాట్లాడిన కాన్ఫిడెన్స్ చూస్తే అర్ధమవుతుంది. 

ఎన్టీఆర్ తన చేతిలో పెట్టిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి డ్యామేజ్ చేయకుండా...డైరెక్టర్ గా కొరటాల ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. పైగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కించటం కొరటాలకు ఇదే ఫస్ట్ టైమ్‌.. ఓ విధంగా చెప్పాలంటే కొరటాల శివ ఇమేజ్ కి మించి తనపై బరువు వేసుకున్నాడు. కానీ సెట్స్ పై ఎలాంటి టెన్షన్ పడకుండా ముందుగానే అంత సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ చాలా నమ్మకంగా తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కిస్తానని చెప్పగలిగాడని ఇండస్ట్రీలు వర్గాలు చెబుతున్నాయి. కొరటాల..తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అనే విషయం తెలియాలంటే ....వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు