ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో మరో సినిమా.. నేడే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌!

12 Apr, 2021 04:18 IST|Sakshi

‘అరవింద సమేత వీరరాఘవ’(2018) సినిమా తర్వాత హీరో జూనియర్‌ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా ఎనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా గతంలోనే చురుగ్గా సాగాయి. అయితే ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిందని... హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో దర్శకుడితో, హీరో మహేశ్‌బాబుతో త్రివిక్రమ్‌ సినిమా చేయనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

ఈ తరుణంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా చేయనున్న సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్ట్‌ చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే ప్రచారం కూడా సాగింది. కానీ తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. ‘జనతా గ్యారేజ్‌’(2016) తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్, కొరటాల శివ మళ్లీ ఇప్పుడు కలిసి పని చేయనున్నారట.

మరి.. అల్లుఅర్జున్‌–కొరటాల శివ కాంబినేషన్‌లోని సినిమా పరిస్థితి ఏంటి? అన్న అన్ని ప్రశ్నలకు సోమవారం ఓ స్పష్టమైన ప్రకటన ఇవ్వనున్నారు. ఆంతరంగిక వర్గాల కథనం ప్రకారం త్రివిక్రమ్‌తో తారక్‌ సినిమా ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఆ స్థానంలో త్రివిక్రమ్, మహేశ్‌బాబు సినిమా పట్టాలెక్కుతోంది. మరోపక్క కొరటాల శివ, అల్లు అర్జున్‌ల సినిమా కూడా ఇప్పటికి ఆగిపోయినట్టే. దాని బదులు కొరటాల – తారక్‌ల కాంబినేషన్‌ చిత్రం మొదలు కానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్, ‘ఆచార్య’ తరువాత కొరటాల కలసి ఈ కొత్త సినిమా చేస్తారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు