వాడి పొగరు ఎగిరే జెండా

22 Oct, 2020 23:50 IST|Sakshi
ఎన్టీఆర్‌

‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే రాజ్యాలు సాగిలబడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్‌ ...’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ చేస్తున్న కొమురం భీమ్‌ పాత్ర గురించి తన స్టైల్‌లో వాయిస్‌ ఓవర్‌ చెప్పారు అల్లూరి రామరాజు పాత్ర చేస్తున్న రామ్‌చరణ్‌. అక్టోబర్‌ 22న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ అంటూ టీజర్‌ను రామ్‌చరణ్‌ గురువారం విడుదల చేశారు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ పాత్ర నిప్పైతే, యన్టీఆర్‌ పాత్రను నీటిలా డిజైన్‌ చేశారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్‌ ఈ మధ్యే పునః ప్రారంభమైంది. ఇప్పటికే అగ్రభాగం సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం  హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నవంబర్‌లో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు. 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారవుతున్న ఈ ఫిక్షనల్‌ పీరియాడిక్‌ చిత్రం 2021లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు