ఏప్రిల్‌లో ఎంట్రీ?

18 Dec, 2020 06:05 IST|Sakshi

‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత మరో సినిమా కోసం కలిశారు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలో సెట్స్‌ మీదకు తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే కోవిడ్‌ వల్ల సినిమా పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించాలనుకుంటున్నారన్నది తాజా వార్త. యస్‌. రాధాకష్ణ, కల్యాణ్‌ రామ్‌ నిర్మించనున్నారు. మార్చిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కానుంది. ఆ వెంటనే ఏప్రిల్‌లో త్రివిక్రమ్‌ సినిమాలోకి ఎంట్రీ ఇస్తారట ఎన్టీఆర్‌. ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇదో పొలిటికల్‌ డ్రామా అని టాక్‌. ఎన్టీఆర్‌కి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ సినిమా.

మరిన్ని వార్తలు