అది అల్లు అర్జున్ స్టోరీనా?.. కొరటాల, ఎన్టీఆర్‌ మూవీపై నెట్టింట చర్చ

22 May, 2022 16:42 IST|Sakshi

కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా గురించి అప్పుడే రూమర్స్‌ మొదలయ్యాయి. ఈ సినిమా కథను కొరటాల ఎప్పుడో రాసుకున్నాడని, ఓ స్టార్‌ హీరోతో ఆ చిత్రాన్ని తీయాలనుకున్నాడట. అది కుదరకపోవడంతో అదే కథతో ఎన్టీఆర్‌ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల మొదట అనుకున్న స్టార్‌ హీరో అల్లు అర్జునే అని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆచార్య రిజల్ట్‌ కొరటాలకు షాకిచ్చింది. ఈ సమయంలో ఆయన కొత్త కథ రాసుకోవడం కాస్త కష్టమే. అందుకే గతంలో రాసి పెట్టుకున్న బెస్ట్‌ స్టోరీనే పట్టాలెక్కించాలని ఫిక్స్‌ అయ్యాడట. గతంలో ఈ కథని బన్నీకి వినిపించాడట. ఈ స్టోరీతోనే సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు మాట తప్పి యంగ్‌ టైగర్‌తో ఫిక్స్‌ అయ్యాడని అంటున్నారు. ఈ రూమర్‌లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం జోరుగా డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.  

(చదవండి: పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ కోసం సేఫ్‌సైడ్‌ గేమ్‌!)

గతంలో తివిక్రమ్‌ కూడా ఎన్టీఆర్‌ విషయంలో ఇలానే చేశాడు. అజ్ఞాతవాసితో డిజాస్టర్ తర్వాత వెంటనే తారక్ సినిమా ఉన్నప్పుడు.. గతంలో తాను పవన్ కల్యాణ్‌ కోసం రాసుకున్న కోబలి కథ నుంచి కొంత తీసుకుని అరవింద సమేత స్టోరీని డెవలప్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కొరటాల కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు