నటికి తీవ్ర అస్వస్థత.. షూటింగ్‌ సెట్స్‌ నుంచే హాస్పిటల్‌కి

7 Aug, 2021 15:14 IST|Sakshi

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటి నుష్రత్‌ బరుచా ఆసుపత్రి పాలైంది. లవ్‌ రంజన్‌ సెట్స్‌పై ఉండగానే ఉన్నట్లుండి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో యూనిట్‌ సభ్యులు నుష్రత్‌ను వెంటనే ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. మూడు వారాల పాటు విరామం లేకుండా షూటింగ్‌ చేయడంతో ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు వైద్యులు తెలిపారు. మరో 15 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు.

కాగా కొన్నాళ్ల నుంచి తాను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నానని, దీంతో ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోవడం, బలహీనంగా అయిపోవడం లాంటివి జరుగుంటాయని..ఆరోజు కూడా అదే విధంగా జరిగిందని నుష్రత్‌ తెలిపింది. ఆరోజు షూటింగ్‌ జరుగుతండగానే నా ఆరోగ్యం కాస్త క్షీణిస్తున్నట్లు అనిపించింది. అప్పటికే నా బీపీ 65/55 కి పడిపోయింది. దీంతో కనీసం నడవలేని స్థితిలో ఉండగా వీల్‌ చెయిర్‌లోనే ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు.

అప్పటికే అమ్మానాన్న అక్కడికి చేరుకున్నారు. బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే నేను ఇంకా హాస్పిటల్‌లోనే ఉంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాను అని పేర్కొంది. ప్రస్తుతం నుష్రత్‌ చేతిలో లవ్‌ రంజన్‌తో పాటు రామ్‌సేతు, హుర్దాంగ్ సహా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు