Suman: అందుకే మేమిద్దరం దగ్గరయ్యాం: సుమన్

26 Dec, 2022 18:56 IST|Sakshi

కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం 'నువ్వే నా ప్రాణం'.  ఈ సినిమాలో సుమన్‌, భానుచందర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై  శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని డిసెంబర్‌ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.  

భానుచందర్‌ మాట్లాడుతూ... 'సివిల్‌ ఇంజనీర్‌కి మూవీ డైరెక్షన్‌కి ఎక్కడా కూడా కనెక్షన్‌ అనేది లేదు. కానీ మొదటి నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు ఆయన. సెట్స్‌లో కూడా ఎన్ని పనులు ఉన్నా చాలా బాగా పనిచేసేవారు. ఇటువంటి చిత్రాలను అందరూ ఆదరించి  మూవీని పెద్ద హిట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు.

నటుడు సుమన్‌ మాట్లాడుతూ... 'సడెన్‌గా నేను యాక్టర్‌ అయ్యా. ఇన్నేళ్ల నా సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించా. నాకు మొదటిసారి అవకాశాన్ని ఇచ్చిన నా గాడ్‌ ఫాదర్‌ రామన్నకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే తర్వాత నా గాడ్‌ బ్రదర్‌ భానుచందర్‌ అని చెప్పాలి. ఆయన నాకు తెలుగు రాకపోయినా ఎంతో ఎంకరేజ్‌ చేసి నన్ను కన్నడ చిత్రాల్లోనే కాక తెలుగు సినిమాల్లో నటించేలా చేశారు. నేను భానుచందర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్టిస్టులం. అందువల్ల ఎక్కువ దగ్గరయ్యాం. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నాం. హీరో, హీరోయిన్లు ఈ చిత్రంలో బాగా నటించారు. అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి హిట్‌ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు