కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

18 May, 2021 09:36 IST|Sakshi

భువనేశ్వర్‌: కరోనాతో ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి సోమవారం మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం వైరస్‌ బారినపడిన ఈయన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, కేంద్రమంత్రి ప్రతాప్‌ చంద్ర షడంగి, ఓలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. 
చదవండి: కరోనాతో టీవీ ఛానల్‌ ఎండీ కన్నుమూత

మరిన్ని వార్తలు