Video: ఆస్కార్‌ ఆర్‌ఆర్‌ఆర్‌, ది ఎలిఫెంట్‌ వి‍స్పరర్స్‌కు వెరైటీ విషెస్‌, ఒకరు ఇసుకతో, మరొకరు షార్ట్‌ వీడియోతో

16 Mar, 2023 09:07 IST|Sakshi

నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌కు అంతర్జాతీయ శాండ్‌ యానిమేటర్‌ మాస కుమార్‌ సాహు సైకత యూనిమేటర్‌తో కళాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 7 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి, 1 నిమిషం 50 సెకన్ల నిడివితో యానిమేటెడ్‌ వీడియో చిత్రీకరించినట్లు తెలిపారు. ఉత్తమ ఒరిజినల్‌ పాటగా నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు లభించడం మన జాతికి గర్వకారణమని అభినందించారు.

అదేవిధంగా  ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరి తీరంలో ఆస్కార్ అవార్డు విజేతల సైకత శిల్పాన్ని రూపొందించారు. అకాడమీ అవార్డులు గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌చిత్రంలోని ‘నాటు నాటు’ నృత్య చిత్రాన్ని, ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ లఘచిత్రంలోని గజరాజు శిల్పంతోపాటు మధ్యలో ఆస్కార్ ప్రతిమ ఉన్న ఆరడుగుల ఎత్తైన శిల్పాన్ని ఇసుకతో తయారుచేశారు. రెండు భారతీయ చిత్రాలకు అకాడమీ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. 

కాగా, ఈనెల 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలు)లాజ్‌ ఏంజిల్‌లో జరిగిన 95వ ఆస్కార్‌ ప్రదానోత్సవంలో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు(ఆర్‌ఆర్‌ఆర్‌)’ పాటకు అస్కార్‌ లభించింది. నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్‌ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. ఆస్కార్‌ గెల్చుకున్న ఇండియన్‌ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసింది. అలాగే బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సినిమా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను ఆస్కార్‌ వరించింది.

మరిన్ని వార్తలు