హారర్‌ సినిమాలు చేయకూడదనుకున్నా

19 Jun, 2023 01:31 IST|Sakshi
అనూప్, నందితా శ్వేత, శంకర్, శంకర్‌ మార్తాండ్‌

– నందితా శ్వేత

‘‘హారర్‌ చిత్రాల్లో నటించకూడదనుకున్నాను. కానీ ‘ఓ మంచి ఘోస్ట్‌’ సినిమా కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరోయిన్‌ నందితా శ్వేత అన్నారు. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్‌’. అభినిక ఐనాభాతుని నిర్మించారు.

అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పాప నువ్వు తోపు..’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. సింహాచలం లిరిక్స్‌ అందించిన ఈ పాటను బాలసూరన్న పాడారు. ఈ పాట విడుదల వేడుకలో శంకర్‌ మార్తాండ్‌ మాట్లాడుతూ–‘‘హారర్‌ అండ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్‌’. హారర్‌ కథలకు మ్యూజిక్‌ చాలా ముఖ్యం.. అనూప్‌గారు ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ పాప నువ్వు తోపు..’ పాట  ఆకట్టుకుంటుంది’’ అన్నారు అనూప్‌ రూబెన్స్. 

మరిన్ని వార్తలు