ఒక లోకం... రెండు కోట్లు

2 Feb, 2021 06:24 IST|Sakshi

‘‘పోలీస్‌ స్టోరీ’ సినిమా 25 సంవత్సరాల వేడుకకి వెళ్లినప్పుడు బెంగళూరులో ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి, వింటున్నారు. తమిళనాడులో కూడా ఈ పాటకు స్పందన చాలా బాగుంది. ఆది కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్‌ ఇది. ఈ పాటలాగే ‘శశి’ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’’ అని నటుడు సాయికుమార్‌ అన్నారు. ఆది సాయికుమార్‌ హీరోగా, సురభి హీరోయిన్‌గా శ్రీనివాస్‌ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్‌.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. అరుణ్‌ సంగీతం అందించారు. చంద్రబోస్‌ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ పాట రెండు కోట్లకు పైగా వ్యూస్‌ దాటింది.

ఈ సందర్భంగా ‘ఒకే ఒక లోకం..’ పాట సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘పాటను ఇంతలా ఆదరించినవారికి థ్యాంక్స్‌. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్‌ నాయుడు నందికట్ల. ‘‘2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపజేస్తో్తంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామేన్‌ అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి, మాటల రచయిత రవి, స్క్రీన్‌ ప్లే రైటర్‌ మణి, ఆర్ట్‌ డైరెక్టర్‌ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్‌.పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధి నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు