Director Om Raut: రావణుడిగా సైఫ్‌ లుక్‌పై ట్రోల్స్‌, వివరణ ఇచ్చిన డైరెక్టర్‌

7 Oct, 2022 15:51 IST|Sakshi

గత కొద్ది రోజులుగా ఆదిపురుష్‌ మూవీ వివాదం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. మూవీ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఆదిపురుష్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీజర్‌లో రావణుడి పాత్ర, హనుమంతుడి పాత్రను చూపించిన విధానంపై హిందు సంఘాలు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్‌ సినిమా తీశారంటూ, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదా.. ఆయా పాత్రలకు లేదర్‌ షూలు వేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

చదవండి: మరో నటితో భర్త వివాహేతర సంబంధం, పోలీసులను ఆశ్రయించిన నటి దివ్య

అంతేకాదు ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ బాగా లేదంటూ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రావణాసురుడు పాత్రపై వస్తున్న నెగిటివిటిపై దర్శకుడు ఓంరౌత్‌ వివరణ ఇచ్చాడు. ‘రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్ తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రావణుడు అంటే పొడవాటి జుట్టు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంతో చూపించేవారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా తెలిపారు. కానీ ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికీ ఈ సినిమా చేరాలని భావిస్తున్నాను.

చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్‌ శ్రీలీల తల్లిపై కేసు

ఈ మూవీతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే రావణుడి లుక్ అలా డిజైన్ చేశాం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘రావణుడు భయంకరమైన పక్షిపై కూర్చున్నట్లు చూపించాం. కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రాకండి. థియేటర్లో సినిమా చూశాక మాట్లాడంది. సినిమాలో ఎలాంటి లెదర్ దుస్తులు ఉపయోగించలేదు. మమ్మల్ని నమ్మండి’ అంటూ వివరణ ఇచ్చాడు ఓంరౌత్‌. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలన జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు