భార్గవ్‌తో సంబంధం లేదు..ఆ వీడియోలు డిలీట్‌ చేయండి: OMG నిత్య

20 Apr, 2021 20:15 IST|Sakshi

మైనర్‌ బాలిక అత్యాచార కేసులో టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక భార్గవ్‌ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనగానే. చాలామంది  ‘ఓమైగాడ్ నిత్య’పేరును తెరపైకి తీసుకొచ్చారు. భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు నిత్య ఫోటోలను వాడేస్తున్నారు. అయితే తాజాగా ఈ వార్తపై  నిత్య స్పందించింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది.

‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడటం జరిగింది. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం.

అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్‌ వాళ్లు నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. మీరంతా తెలియక చేస్తున్నారని నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు  తెలుస్తాయి. అప్పుడైనా డిలీట్‌ చేయండి. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్‌లో ఉన్నా’ అంటూ తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది
 

చదవండి:
అత్యాచారం కేసులో ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అరెస్ట్‌
ఆ ఫోటోలతో బ్లాక్‌ మెయిల్‌.. భార్గవ్‌ నిజస్వరూపం బట్టబయలు‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు